మగాళ్ల మధ్య ప్రేమ.. అది చేశాక నచ్చలేదని బ్రేకప్

Update: 2023-08-16 15:49 GMT

మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆలోచనా విధానం కూడా మారుతోంది. ప్రేమ, పెళ్లంటే.. అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగేది మాత్రమే కాదని.. రెండు మనసులు కలిస్తే చాలాని బలంగా నమ్ముతున్నారు. ఒకప్పుడు అబ్బాయిగా పుట్టినా అమ్మాయి లక్షణాలున్నా చాలామంది.. తమ లోపాన్ని బయటికి చెప్పలేక లోలోపలే కుమిలిపోతుండే వాళ్లు. ఇప్పుడు కాలం మారింది. ఆలోచనలకు తగ్గట్లే చట్టాలె కూడా మారాయి. ఆ చట్టాలతో ఇద్దరు వ్యక్తుల మధ్య అంగీకారం, ప్రేమ ఉంటే చాలు జెండర్ ఏదైనా పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి.

తాజాగా విజయవాడలో ఇద్దరు పురుషుల వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్లు.. అర్థం పర్థం లేకుండా బ్రేకప్ చెప్పుకున్నారు. దాంతో వీరి ప్రేమ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయవాడలో బీఈడీ చదివే సమయంలో నాగేశ్వర్ రావు, పవన్ లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు చదువైపోయాక ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నారు. తర్వాత పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కాగా, ఢిల్లీ వెళ్లి పవన్ అవయవ మార్పిడి కూడా చేసుకుని.. అమ్మాయిలా మారిపోయాడు. పవన్ కాస్త బ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. ఇక మిగిలింది పెళ్లే అనుకునేంతలో నాగేశ్వర్ ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లికి నిరాకరించి.. దూరంగా వెళ్లిపోయాడు. దీంతో చేసేదేంలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 




Tags:    

Similar News