MP Balashowry : జనసేనలో మచిలీపట్నం ఎంపీ చేరికకు ముహూర్తం ఫిక్స్

Byline :  Krishna
Update: 2024-01-30 06:18 GMT

అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రంజుగా సాగుతోన్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల జంపింగ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లగా.. తాజాగా ఓ ఎంపీ అదే లిస్ట్లో చేరారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరతానని అప్పుడే ప్రకటించారు. తాజాగా ఈ చేరికకు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.

వైసీపీ తీరుపై బాలశౌరి గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి జోగి రమేష్లతో ఆయనకు విబేధాలు ఉన్నాయి. వీటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని బాలశౌరి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని.. ఇలానే ఉంటే తన రాజకీయ భవిష్యత్ కష్టమవుతోందంటూ వైసీపీకీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పవన్తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరడం సహా వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధిపై పవన్కు స్పష్టమైన అవగాహన ఉందని ఆ భేటీ తర్వాత బాలశౌరి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి..రైతులకు సాగునీరు అందించడమే తన ధ్యేయమని చెప్పారు.


Tags:    

Similar News