మందుబాబు హల్చల్.. అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే..

By :  Kiran
Update: 2023-11-12 16:02 GMT

విశాఖ జిల్లా మధురవాడలో ఓ మందుబాబు హల్ చల్ సృష్టించాడు. తాను అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపులో బీభత్సం సృష్టించాడు. కొమ్మాదిలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వచ్చిన సదరు బ్యాక్తి ఓ బాటిల్ పేరు చెప్పి ఇవ్వాలని అడిగాడు. అయితే బ్రాండ్ లేదని షాపు సిబ్బంది చెప్పారు. దీంతో నిందితుడికి ఒక్కసారిగా కోపం నషాళానికి అంటింది.

పరుగెత్తుకుంటూ తన బైక్ వద్దకు వెళ్లిన నిందితుడు అందులోంచి పెట్రోల్ తీశాడు. బాటిల్లో ఉన్న పెట్రోలును వైన్ షాపులో పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. స్థానికులు నీళ్లు చల్లి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 15 మద్యం కేసులతో పాటు ఓ కంప్యూటర్, ప్రింటర్ కాలి బూడిదయ్యాయి. షాపు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News