MLA RK : మంగళగిరి వైసీపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సొంతగూటికి ఎమ్మెల్యే
ఆయన వైసీపీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ తీరును విమర్శిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యింది. దీంతో హస్తం కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అవును ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు పార్టీ సైతం ఆయన్ను చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆర్కేతో విజయసాయి రెడ్డి మంతనాలు జరపగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
మంగళగిరి టికెట్ మరొకిరికి ఇస్తారని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీని వీడారు. అటు జగన్ సైతం మంగళగిరి ఇంఛార్జ్గా గంజి చిరంజీవిని నియమించారు. అయితే నియోజకర్గ క్షేత్రస్థాయిలో గంజికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ అధిష్ఠానం పునరాలోచనలో పడింది. మళ్లీ ఆర్కేను చేర్చుకొని మంగళగిరి గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ ను ఆర్కే కలిసే అవకాశం ఉంది. తన సోదరుడు, ఎంపీ అయోధ్యరామిరెడ్డితో కలిసి ఆయన సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లనున్నారు.