AP Road Accident : ఏపీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. స్పాట్లోనే నలుగురు..
Byline : Krishna
Update: 2024-02-26 02:01 GMT
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన లారీ టైర్ మారుస్తుండగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెంది దాసరి కిషోర్, ప్రసాద్, నాగయ్య, రాజాగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.