వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు - ఆటో ఢీ..
Byline : Veerendra Prasad
Update: 2023-10-09 04:58 GMT
ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈ ఘటనలో నలుగురు మరణించగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మహమ్మద్, హసీనా, అమీనా, షాకీర్ లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.