వైసీపీ 5వ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కాకినాడ ఎంపీ చలమశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ సింహాద్రి రమేశ్‌బాబు, నరసరావుపేట ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ గురమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే నూకతోటి రాజేష్, అరుకు వ్యాలీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అవగనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు. వైసీపీ ఇప్పటి వరకు 10 పార్లమెంట్, 58 అసెంబ్లీ స్థానాలకు నాలుగు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ స్థానాల్లో చాలా చోట్ల కొత్త వారికి అవకాశాలు కల్పించిన వైసీపీ అనేక మందికి సీట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. కొంత మందికి స్థానాలను మార్చింది. మరి కొందరికి పెండింగ్‌లో పెట్టింది. ఇంకొందరిని ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుపుతోంది.ఇదిలా ఉంటే తెలుగుదేశం కూడా జనసేనతో పొత్తులో భాగంగా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.