Minister Roja : పులస పాప అన్న బండ్ల గణేష్.. గట్టి కౌంటర్ ఇచ్చిన రోజా
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అన్న మంత్రి రోజాపై బండ్ల గణేష్ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. రోజాకు ఎమ్మెల్యే సీటు వస్తుందో రాదో అన్న ఆయన రేపో మాపో మాజీ అవ్వడం ఖాయమని విమర్శించారు. పగలు జబర్దస్త్ షూటింగులు, రాత్రిళ్లు పులస పులుసు పెట్టుకుంటూ ఉండాలని సెటైర్ వేశారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ వ్యాఖ్యలపై రోజా స్పందించారు.
7‘o’ క్లాక్ బ్లేడ్ తో కోసుకుని చస్తానన్న బండ్ల గణేష్ మహిళలపై నీచమైన కమెంట్స్ చేయడం దారుణమని రోజా విమర్శించారు. స్వశక్తితో ఎదిగే మహిళలను చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అటు పవన్ కల్యాణ్ పై సైతం రోజా విమర్శలు గుప్పించారు. రెండు చోట్లా ఓడిపోవడం పవన్ సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. పవన్కు ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్ పెరిగి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీని గాలికొదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ కేడర్ తిట్టడం కరెక్ట్ కాదన్నారు.