జైల్లో ఉన్న దొంగతో ప్యాకేజీ స్టార్ ఒప్పందం - మంత్రి రోజా

Byline :  Kiran
Update: 2023-09-15 10:52 GMT

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ వేర్వేరు కాదని మంత్రి రోజా అన్నారు. ఇద్దరూ తోడు దొంగలేనని ఆరోపించారు. మచిలీపట్నంలో పర్యటించిన ఆమె చంద్రబాబు, పవన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం చేసే దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని రోజా మండిపడ్డారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఆ పార్టీతో చర్చించకుండానే జైలులో ఉన్న దొంగతో భారీ ప్యాకేజీ మాట్లాడుతున్నాడని రోజా ఆరోపించారు. ఆయన ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టాడన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. అందుకే 2019లో ఆ ప్యాకేజీ స్టార్ను జనం రెండు చోట్ల ఓడించారని అన్నారు. అహంతో విర్రవీగిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడని, రేపు నారా లోకేష్ సైతం జైలుకు వెళ్తాడని రోజా జోస్యం చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమని నారా లోకేష్, భవనేశ్వరి ప్రకటించాలని సవాల్ విసిరారు.




Tags:    

Similar News