పవన్ కల్యాణ్ వల్ల ఎంతమంది ఆడపిల్లలు మిస్సయ్యారో తేల్చాలి.. రోజా

By :  Kalyan
Update: 2023-07-28 10:36 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఒప్పుకున్నాయి. ఇన్నాళ్లూ కన్నుమూసుకున్నట్లు పార్టీలు, పోలీసు యంత్రాంగం ఈ అమానుషంపై తీరిగ్గా స్పందిస్తున్నాయి. మహిళల అక్రమ రవాణా వెనుక కొంత మంది వలంటీర్ల హస్తం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడంతో అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్రంలో 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని డీజీపీ కూడా అంగీకరించారు. పవన్ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పట్నుంచీ భగ్గుమంటున్న వైకాపా నేతలు దాడిని మరింత తీవ్రం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుంటూ మంత్రి, సినీనటి రోజా మళ్లీ బాణాలు సంధించారు. ‘‘వపన్ కల్యాణ్ మాటలు గురివింద గింజల్లా ఉన్నాయి. అసలు అతని వల్ల ఎంత మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారో లెక్క తేల్చాల్సిన అవసరం ఉది. ఏపీలో మహిళలు కనిపించడం లేదని పవన్‌కు ఏ నిఘా సంస్థ సమాచారమిచ్చిందో చెప్పాలి..’’ అని ఆమె డిమాండ్ చేశారు. పనిలో పనిగా చంద్రబాబుపైనా దుమ్ముత్తి పోశారు. 14 ఏళ్లు సీఎం పదవి వెలగబెట్టిన బాబు రాష్ట్రాన్ని దోచుకుతున్నారని మండిపడ్డారు.

రోజా ఇటీవల పవన్‌ను విమర్శిస్తూ సంస్కారం గురించి ఆయన చెబుతుంటే ‘‘సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లు ఉంది’’ అని అన్నారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. సన్నిలియోన్ పేరుతో ఉన్న నకిలీ ట్విటర్ హ్యాండిల్ నుంచి రోజాపై ఎవరో విమర్శలు సంధించారు. ‘‘నేను మాజీ శృంగారతారను. నా గతం గురించి నేనెప్పుడూ రవంత పశ్చాత్తాపపడలేదు. చేయాలనుకున్నది సరే బహిరంగంగానే చేశాను. నీకూ నాకూ తేడా ఏమంటే నేను నేను ఇండస్ట్రీని వదిలేశాను. నవ్వు వదిలేయలేదు’’ అని ఆ ట్వీట్లో ఉంది. దీనికి కొందరు రోజా, సన్నీలియోన్ గురించి మాట్లాడుతున్న వీడియో క్లిప్పును జత చేశారు. ఇది జనసేన, టీడీపీ శ్రేణులు పనే అయ్యుంటుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై రోజా భావోద్వేగంతో స్పందించారు. ‘‘వైఎస్ భారతమ్మ.. నీ భర్తకు నువ్వు కాస్త సంస్కారం నేర్పించమ్మా లేదంటే నేను నేర్పిస్తాను’’ అని పవన్ అన్నారు. దీనిపై రోజా ఘాటుగా బదులిస్తూ ‘‘పవన్ కల్యాణ్ జగన్‌కు సంస్కారం నేర్పిస్తాడంట. ఎలా ఉందంటే.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లు ఉంది. జగన్ సంస్కారవంతుడు, తండ్రిని మించిన తనయుడు’’ అని రోజా చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News