వైఎస్ షర్మిల మీద మంత్రి రోజా సెటైర్లు..చెప్పేవన్నీ అబద్ధాలే
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)పై ఏపీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. షర్మిల కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా అని కానీ ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుదని అన్నారు. కుటుంబాలను కుల్చడం చంద్రబాబు(Chandrababu)కు అలవాటేనని అన్నారు. నాడు ఎన్టీఆర్ నేడు వైయస్సార్ కుటుంబం అని చెప్పారు చంద్రబాబు అవకాశం ఇచ్చిన షర్మిలదే తప్పు అని అన్నారు. వైయస్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి అభ్యర్థులు దొరకకపోవడంతో పార్టీ నుండి తరిమేసి వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టుకున్నారని అన్నారు.
వైఎస్ కుటుంబం మాట మీద నిలబడతారు అని నమ్మకం ప్రజలకి ఉందని అన్నారు. మేనిఫెస్టోలోవి పెట్టినవి అమలు చేస్తామని చెప్పే ధైర్యం బాబుకి లేదని రోజా అన్నారు. తెలంగాణ(Telangana)లో పార్టీ పెట్టుకున్న షర్మిల.. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేనల కోసం ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆమె తెలిపారు. ఏపీకి వచ్చిన షర్మిల అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. తన నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటున్న విపక్ష నేతలు.. నగరికి వచ్చి చూస్తే తాము చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు. గతంలో షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ మంత్రి రోజా (Minister Roja) వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ (YSR) కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.