Minister Roja : షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు.. నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. షర్మిలకు అసలు రాజకీయ అవగహన లేదని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా ఏపీలో లేకుండా తెలంగాణలో తిరుగుతూ ఆ రాష్ట్ర బిడ్డనని చెప్పుకుందని అన్నారు. ఇప్పుడు వచ్చి సీఎం జగన్‌పై విషం చిమ్ముతుందని మండిపడ్డారు. చంద్రబాబు, కాంగ్రెస్ నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటరని రోజా ఆరోపించారు. మంత్రి రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, రోజా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశారు.
6,100 భర్తీలకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారని ఆమె అన్నారు. నాలుగున్నరేళ్లు తెలంగాణ బిడ్డను అని చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి షర్మిల హడావుడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇప్పుడైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూస్తే అర్థమైంది. నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తాను తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంది. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్ముతూ ఆరాటాలు, పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము’ అంటూ హెచ్చరించారు.