ఏపీ సత్యవేడు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం విమర్శించారు. ఆ అక్రమాలను తనపై తోసేసి సత్యవేడు నుంచి తప్పించారని ఆరోపించారు. నాకు ఇష్టం లేక పోయినా తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ఆత్మీయ సమావేశం తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా సమావేశం పెట్టడమేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి , కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ ప్రశ్నించారు.1989లో మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత ? అని ప్రశ్నించారు. ఇష్టం లేకపోయినా తనను తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌చార్జ్‌గా ప్రకటించారని ఆరోపించారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల సహకారం తనపై ఉందని అన్నారు. దళితుడయిన తనను అవమానపరుస్తున్నారని ఆరోపించారు.