జైలులో బావ.. బాబు సీటులో బాలయ్య..

By :  Kiran
Update: 2023-09-11 14:03 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. టీడీపీ అధినేత జైలుకు వెళ్లడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ హెడ్ క్వార్టర్స్ లో సమావేశం ఏర్పాటు చేశారు

బాలకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్లు పాల్గొన్నారు. యనమల, కంబంపాటి సహా పలువురు నేతలు ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్పై చర్చించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టాల్సి చర్యలకు సంబంధించి బాలయ్య సలహాలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News