అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఎమ్మెల్సీ కారు..!
ఏపీలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అధికార వైసిపి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం అర్ధరాత్రి ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విజయవాడ నుంచి నెల్లూరు(Nellore) కు గురువారం రాత్రి బయలుదేరారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే అర్థరాత్రి ఎమ్మెల్సీ కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఓ లారీ అడ్డువచ్చింది. ఈ లారీ టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారి నెమ్మదించగా వెనుకాలే ఉన్న ఎమ్మెల్సీ కారు అదుపు తప్పి లారీ వెనకభాగాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో ఎమ్మెల్సీ తలకు గాయలయ్యాయి. ఆయన పీఏ అక్కడిక్కడే మరణించారు.
కాగా ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారందర్నీ నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారని..ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్ను పోలీసులు స్పాట్ కు వెళ్లారు. ఎమ్మెల్సీ పీఎ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమ్మితం నెల్లూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గత నెలలో తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు.