ఆయనకు టిక్కెట్ ఇస్తే.. పార్టీ వీడుతా.. సీఎంకు ఎంపీ అల్టిమేటం

Update: 2023-07-23 09:43 GMT

కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంపీ సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణుగోపాల్ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. ఇరువురు నేతలు బలప్రదర్శనలతో నువ్వా నేనా అంటూ ఆధిపత్య సవాల్ విసురుకుంటున్నారు. మొన్న బోస్ ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఇవాళ మంత్రి వేణు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం టిక్కెట్ మంత్రి వేణుకు ఇస్తే తాను వీడేందుకు అయినా సిద్ధం అని ఎంపీ బోస్ ప్రకటించారు. అవసరమైతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. వేణుతో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పార్టీకి నష్టం జరిగినా తనకు కేడర్ ముఖ్యమని చెప్పారు. ఈ సారి తమ కుటుంబం నుంచి పోటీకి దిగాలని క్యాడర్ కోరుకుంటోందని చెప్పారు. తన వర్గీయులను వేణు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు.

రామచంద్రపురం టికెట్ విషయంలో మంత్రి వేణు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బోస్ కుమారుడు ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఐతే.. అధిష్టానం వేణుకే హామీ ఇచ్చిందనే వాదనలున్నాయి. దీంతో బోస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లి వెళ్లి వివరణ ఇవ్వడం కూడా ఇచ్చారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. వేణుకు మద్ధతు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.

Tags:    

Similar News