Vemireddy Prabhakar Reddy : నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్..టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Byline :  Vinitha
Update: 2024-03-02 08:12 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పార్టీ ఫిరాయింపులు భారీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన టీడీపీ భారీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీతో పాటు భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతలు పార్టీలు మారుతున్నారు. గెలుస్తుందని భావిస్తున్న పార్టీలోకి ఆయా పార్టీల నేతలు జంప్ అవుతున్నారు.






 


Tags:    

Similar News