తెలుగు రైతు అధ్యక్షుడిపై దాడి..ఒంగోలులో టెన్షన్ టెన్షన్

By :  Shabarish
Update: 2024-02-20 14:38 GMT

ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై హత్యాయత్నం జరగడంలో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేయడంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒంగోలులో జిమ్స్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడు అయిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఆస్పత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చర్చిస్తుండగానే ఆయన అనుచరులు ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన మర్రెడ్డిని ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఘటన ముందస్తు ప్లాన్ ప్రకారంగా జరిగినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News