Pawan Kalyan : పవన్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు కాదు.. షాకింగ్ కామెంట్స్
తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో నేడు జనసేనాని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన నాలుగో భార్య జగన్ అని అన్నారు. తన పెళ్లిళ్లపై వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ అంటే మూడు పెళ్లిళ్లు కాదన్నారు. వైసీపీ నేతలంతా పవన్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అని అంటారని, అలా అయితే తన నాలుగో భార్య జగన్ అని అన్నారు.
సీఎం జగన్ భార్యను తాను భారతిగారు అని మర్యాదిస్తానని, కానీ చంద్రబాబు, తన విషయంలో పెళ్లాలు అంటూ సీఎం జగన్ సంభోదిస్తాడని ఫైర్ అయ్యారు. అదే మాట జగన్‌ని అంటే భారతిగారు ఏమంటారని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో జగన్ కోటలను బద్దలు కొడతామన్నారు. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదన్నారు. అలా చేయకుంటే తన పార్టీ పేరు కూడా జనసేన కాదని సవాల్ విసిరారు.
వైసీపీ పార్టీ వాళ్లను నెత్తిమీద కాలేసి తొక్కుతామని, అప్పుడు వారికి తామేంటో అర్థమవుతుందని పవన్ నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ శాంతినేు చూశారని, ఇక తన యుద్ధం ఏంటో చూస్తారని వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు.