Nara Bhuvaneshwari : ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

Byline :  Bharath
Update: 2023-09-30 09:52 GMT

చంద్రబాబును జైలు నుంచి విడిపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాయర్లు కోర్టులో న్యాయంగా పోరాడుతుండగా.. టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం వైఖరిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాలలో ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్నాయుడు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ అయినందుకు తట్టుకోలేక.. ఏపీలో 97 మంది అభిమానులు చనిపోయారు. వారికి సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కలిసి ధైర్యం చెబుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని నారా భువనేశ్వరీ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ.. అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7:05 గంటల వరకు (5 నిమిషాలు) ప్రతీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలన్నారు. మరోవైపు జనసేన టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పోరాడుతుందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.  




Tags:    

Similar News