Nara Lokesh : రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన లోకేష్

Byline :  Krishna
Update: 2023-10-11 06:13 GMT

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఏపీ సీఐడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అధికారులు లోకేష్ను 50 ప్రశ్నల వరకు అడిగినట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన రెండో రోజు విచారణకు హాజరయ్యారు.

మరోవైపు మంగళవారం సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ .. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్ స్కాంకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తన ముందు పెట్టలేదని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో తానుగానీ, తన కుటుంబసభ్యులుగానీ ఎలా లాభపడ్డారన్న దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదని ఆరోపించారు. ఇదంతా కక్షసాధింపే తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసు అని అభిప్రాయపడ్డారు. బుధవారం పనులున్నాయని, ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎంత సమయమైనా సరే ఇవాళే అడగాలని.. కోరినట్లు లోకేష్ చెప్పారు. అయితే సీఐడీ అధికారులు మాత్రం బుధవారం మరోసారి విచారణకు రావాలంటూ తనకు మరోసారి 41 ఏ నోటీసులు ఇచ్చారని అన్నారు.


Tags:    

Similar News