స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబ అరెస్ట్ ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 5వరకు బాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా సెప్టెంబర్ 30న వినూత్న నిరసనకు లోకేష్ పిలుపునిచ్చారు. మోత మోగిద్దాం పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రజలు ఎక్కడున్నా శనివారం రాత్రి 7గంటలకు గంట లేదా ప్లేట్ మీద గరిటతో సౌండ్ చేయాలని పిలునిచ్చారు. ఒకవేళ వాహనాల్లో ఉంటే హారన్ కొట్టాలని చెప్పారు. ఇలా చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు.
‘‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దాం’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ… pic.twitter.com/K0J6bo5RBY
— Lokesh Nara (@naralokesh) September 29, 2023