Nara Lokesh : జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది..అందుకే వాళ్ల సీట్లు మార్చారు.. నారా లోకేశ్

Byline :  Vinitha
Update: 2024-02-17 07:25 GMT

వైసీపీ ప్రభుత్వం పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్. ఈ మేరకు విజయనగరంలోని శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని జగన్‌ అన్నారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక...జగన్‌ మద్యపాన నిషేధం చేశారా? అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో సామాజిక అన్యాయం తప్ప జరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హాయంలో ఏపీ ప్రజలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు.

ప్రజల కన్నీరు నుంచే చంద్రబాబు సూపర్‌ 6 మేనిఫెస్టో వచ్చిందని అన్నారు. సూపర్‌ 6 మేనిఫెస్టోని చూసి జగన్‌ భయపడుతున్నారని విమర్శించారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఎమ్మెల్యే సీట్లను మార్చారని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎమ్మెల్యే స్థానాలనే జగన్‌ మారుస్తున్నారని తెలిపారు. జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్‌ను కూడా ఇవ్వలేదని తెలిపారు. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ, జనసేననే అని ధీమా వ్యక్తం చేశారు. త్వరలొ తాము అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని నారా లోకేశ్ అన్నారు. 




Tags:    

Similar News