ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు నారా లోకేశ్. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయాని స్పష్టం చేశారు. అస్తవ్యస్త పాలనతో జగన్ ఖజానా ఖాళీ చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందని ఆరోపించారు. బకాయిల విడుదల విషయంలో జగన్ ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఆసుపత్రులను డీ లిస్ట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణమని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.