Chandrababu arrest: స్కాంలో నారా లోకేష్ పాత్ర.. సీఐడీ రిపోర్ట్లో సంచలన విషయాలు

Byline :  Bharath
Update: 2023-09-10 03:19 GMT

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ, సిట్ అధికారులు విచారించారు. ఇవాళ (సెప్టెంబర్ 10) ఉదయం 6 గంటల సమయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టి 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ రిపోర్ట్ లో.. స్కాంకు సంబంధించి పూర్తి నాలెడ్జ్ బాబుకు ఉందని సీఐడీ అధికారులు సంచలన అభియోగాలు నమోదు చేశారు. స్కాంలో మిగతా నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. 90శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని అబద్ధాలు చెప్పాగా.. సీమెన్స్ రూపాయి ఇవ్వకుండానే బాబు ఆదేశాలతో అప్పటి ప్రభుత్వం రూ. 371కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ డబ్బు షెల్ కంపెనీల ద్వారా దారిమళ్లిందని, వాటిని చంద్రబాబు మాయం చేశారని ఆరోపించారు.

రిపోర్టులో లోకేశ్ పేరు:

అంతేకాకుండా రిపోర్ట్ ద్వారా మరో సంచలన ఆరోపణ చేశారు సీఐడీ అధికారులు. స్కాం రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పేరునూ చేర్చారు. సీమెన్స్ సహా ఇతర కంపెనీల ప్రతినిధులు ఇల్లందుల రమేష్ ను ద్వారా కలిసిన తర్వాత ఈ ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి స్కిల్ డెవలప్మెంట్ స్కాం చేశారన్న సిట్.. వివిధ కంపెనీల నుంచి డబ్బు కిలారు రాజేశ్ ద్వారా నారా లోకేశ్, పీఏ శ్రీనివాస్ కు చేరిందని తెలిపారు. ఈ స్కాంలో మొత్తం రూ.550 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు.

Tags:    

Similar News