జైలు మోహన్కు బెయిల్ డే శుభాకాంక్షలు : లోకేష్

Byline :  Krishna
Update: 2023-09-23 07:02 GMT

ఏపీ సీఎం జగన్పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే.. జ‌నంలో ఉండాల్సిన చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారని అన్నారు.రాజ్యాంగాన్ని కాలరాస్తూ నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి లోకేష్ ట్వీట్ చేశారు.

‘‘బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు జైలు మోహ‌న్. 42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచేశాడు. సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైలులో ఉన్నారు’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును సీఐడీ విచారిస్తోంది. చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు బాబును అధికారులు విచారించనున్నారు. రేపు సాయంత్రం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరుస్తారు.




Tags:    

Similar News