NaraLokesh: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ

By :  Kiran
Update: 2023-10-11 12:41 GMT

ఇన్నర్‌ రింగ్‌ రోడ్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. దాదాపు 7 గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన లోకేష్.. ఏపీ హైకోర్టు ఒక్క రోజు మాత్రమే విచారణకు హాజరుకావాలని చెప్పినా, సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు రెండోరోజు కూడా వచ్చానని అన్నారు. సీఐడీ ఇవాళ మరో 43 ప్రశ్నలు అడిగారని, మంగళవారం అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారని చెప్పాుర.

తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ డాక్యుమెంట్‌ ముందు పెట్టి అధికారులు ప్రశ్నించినట్లు చెప్పారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ మీ వద్దకు ఎలా వచ్చిందని దర్యాప్తు అధికారిని అడిగితే సమాధానం ఇవ్వలేదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నానని అన్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగారని తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు పదే పదే అడిగారని చెప్పారు.

Tags:    

Similar News