జైల్లో చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్..

Byline :  Krishna
Update: 2023-09-14 15:40 GMT

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నారా లోకేష్ డిల్లీ వెళ్లారు. బాబు అరెస్ట్ నుంచి రాజమండ్రిలోనే ఉన్న లోకేష్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ వెంట టీడీపీ ఎంపీ రామ్మోషన్ నాయుడు ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ సహా ఏపీలోని పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్‌ ఢిల్లీ వెళ్లానట్లు తెలుస్తోంది. పార్లమెంటులోనూ ఏపీ పరిస్థితులు, వైసీపీ తీరుపై చర్చించేలా టీడీపీ వ్యూహం రచించిందట. అదేవిధంగా ఈ నెల 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో బాబు అరెస్ట్పై చర్చించేలా పార్టీ ఎంపీలతో లోకేష్ మాట్లాడనున్నారు. అంతేగాకుండా హస్తినాలో లోకేష్ ఎవరెవరినీ కలుస్తారనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ జైలులో చంద్రబాబును జనసేన చీఫ్ పవన్ కలిశారు. ఈ సందర్భంగా పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలసి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచక పాలనను ఎదుర్కొనేందుకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.


Tags:    

Similar News