హైదరాబాద్‌‎లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా ? :లోకేశ్

Update: 2023-08-13 13:46 GMT

ఏపీ పేపర్లలో నిత్యం హత్యలు, అత్యాచారాలు కబ్జాలు, దాడులు వార్తలే కనిపిస్తే..తెలంగాణ పేపర్లలో నిత్యం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమ వార్తలు కనిపిస్తున్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. రావెలలో అమరావతి ఆక్రందన పేరుతో రాజధాని రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "అమరావతి రైతులను లాఠీలతో కొట్టించాడు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ మోసం చేస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఏర్పడింది. ఎన్నికల టైంలో అమరావతే రాజధానిగా కొనసాగిస్తానని అబద్ధాలు ప్రచారం చేయించారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం రేట్ చూస్తే బాధ వేస్తుంది. జగన్ ప్రభుత్వ విధానం చూసి రాష్ట్ర నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయి." అని లోకేష్ మండిపడ్డారు.




 


కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మద్య జగన్ చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌‎లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా ? కర్ణాటకకు ఫాక్స్‌కాన్ మతం తీసుకెళ్లిందా ? అని లోకేష్ ప్రశ్నించారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. అమరావతిలో ఆపేసిన పనులన్నీ టీడీపీ వచ్చాక ప్రారంభిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. అమరావతి రైతులు అధైర్యపడొద్దన్నారు. ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టిన జగన్ గెలిచాక మడం తిప్పారని విమర్శించారు. విశాఖ ప్రజలకు కూడా మోసం చేస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. అమరావతి ఆక్రందన కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.




 


Tags:    

Similar News