Gitanjali : సీఎం జగన్ ఇల్లు ఇచ్చాడన్న మహిళ.. సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్‌తో సూసైడ్
ఇంటి పట్టాల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ట్రోలింగ్‌ను తన భార్య చెప్పలేదని గీతాంజలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కామెంట్స్ గురించి మాకు చెప్పింది. కానీ నెగటివ్ కామెంట్స్ చెప్పాలేదని ఆయన తెలిపారు. రైల్వేస్టేషన్‌లో వెళ్లక ఫోన్ చేసింది. ఎక్కడుందో తెలుసుకునేలోపే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరోవైపు గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి రోజా హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఇస్లాం పేటలో ఉంటారు గీతాంజలి దేవి. వయసు 29 ఏళ్లు. ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు. అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది.
Om Shanthi #Geethanjali pic.twitter.com/g2DvNIyMRw
— Fukkard (@Fukkard) March 11, 2024
తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరుతోందని సంబరపడిపోయారు గీతాంజలి దేవి. అదే క్రమంలో తనను మాట్లాడించిన ఓ మీడియా ఛానెల్ ఎదుట తన సంతోషం వ్యక్తం చేశారు." సొంత ఇల్లు నా కల. ఇన్ని రోజులకు నెరవేరింది. నా పేరు మీద ఇంటి స్థలం పట్టా వచ్చింది. ఏ డబ్బులు కట్టకుండానే నాకు ఇంటి స్థలం వచ్చింది. మాకు అమ్మ ఒడి వస్తోంది. మా మామయ్యకు పింఛన్ వస్తోంది. మా అత్తకు చేయూత డబ్బులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్న గెలవడం ఖాయం" అంటూ గీతాంజలి తన సంతోషం వ్యక్తం చేశారు. గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందనీ.. దానిని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారనేది మరికొందరి వాదన. అయితే ఎలా చనిపోయిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే ఆ మహిళ ఆనందం.. అంతలోనే విషాదంగా మారటంపై సోషల్ మీడియా నెటిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.