ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు పంపింది. గిరిజన గ్రామాల్లో స్కూల్ ఏర్పాటు చేయకపోవంపై నోటీసులు అందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ చర్యలు చేపట్టింది. పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ అయ్యాయి.
గ్రామంలో సుమారు 60 మంది విద్యార్థులున్నా పాఠశాల లేకపోవడంపై మండిపడింది. 6 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటి స్కూల్స్‌కు వెళ్తున్న విద్యార్థుల కష్టాల చూసి ఎన్జీవో పాఠశాల ఏర్పాటు చేస్తే..ఉపాధ్యాయుడిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. గిరిజన గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.