అన్నవరం వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కొన్ని సూచనలు విడుదల చేశారు. ఇకనుంచి దేవస్థానాల్లోని వసతి గృహాల్లో ఒకసారి రూం బుక్ చేసుకున్నాక మళ్లీ 90 రోజుల తర్వాతే మరో రూం బుక్ చేసుకునేందుకు అనుమతినిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆలయంలో దళారీ వ్యవస్తను అరికట్టేందుకు దేవాలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. దీనికోసం భక్తులు ఆధార్ కార్డు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే గదులు కేటాయిస్తారు. గది బుక్ చేసుకున్న టైంలో, ఖాళీ చేసేటప్పుడు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీనికోసం కొత్త సాఫ్ట్ వేర్ ను తీసుకొచ్చారు. వసతి గృహాల్లో ఎన్ని గదులు ఖాళీ ఉన్నాయి. ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు కొండ దిగువన ఉన్న సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డుల్లో కనిపిస్తాయి.