ఓఎన్జీసీ పైప్ నుంచి గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు
By : Mic Tv Desk
Update: 2023-07-15 05:25 GMT
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు సమీపంలో ఓఎన్జీసీ పైప్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. గ్యాస్ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజీకి సంబంధించి స్థానికులు ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
విషయం తెలిసిన వెంటనే ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నంలో పడ్డారు. మంటలు వ్యాపించకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే రిపేర్ చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.