మొదటి ఘాట్ రోడ్డులో కనిపించిన చిరుత జాడ..

Update: 2023-08-13 07:16 GMT

అలిపిరి నడక మార్గంలో ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి ప్రాణాలు తీసిన నేపథ్యంలో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వన్య మృగాలతో భక్తులకు ఎలాంటి ముప్పు లేకుండా రక్షణ చర్యలు చేపట్టారు. దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ చిరుతను అధికారులు ముమ్మరం చేశారు. దాన్ని పట్టుకునేందుకు దాడి చేసిన ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 35వ మలుపు వద్ద చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో సైరన్ వేసి చిరుతను విజిలెన్స్ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేశారు. ఇక కాలినడకన వెళ్లే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య గుంపులుగా పంపుతున్నారు. చిన్న పిల్లలను దగ్గరే పెట్టుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు చిరుతల దాడుల నియంత్రణకు నిపుణులు కమిటీ ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి టీటీడీ రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Tags:    

Similar News