పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌..పలు రైళ్లు ఆలస్యం

Update: 2023-07-19 12:10 GMT

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డ్‎లో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం పట్టాలు తప్పింది. 6 వ ప్లాట్‌ ఫారంలో ఉన్న రైలులో ఒక భోగీ పట్టాలు తప్పడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అంధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సిన 12763 నెంబర్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ 19.45 ( రాత్రి 7.45) నిమిషాలకు బయలుదేరనుంది. 12793 నెంబర్‌ తిరుపతి - నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ బయలుదేరే సమయం కూడా అధికారులు రీ షెడ్యూల్‌ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ 20:00 ( రాత్రి 8) గంటలకు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


Tags:    

Similar News