ఎన్నికల్లో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..

Update: 2023-09-14 07:58 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజస్వామ్యం లేకుండా పోయిందని, ఈ దుష్టపాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఆయన గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాలకృష్ణ, లోకేశ్‌లతో కలసి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. బాబుతో తనకు విభేదాలు ఉన్నా, వ్యక్తిగా మంచి మనిషి అన్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు.

‘‘చంద్రబాబు నాయుడిగారిని అన్యాయంగా జైల్లో పెట్టాటారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. ఒక మంచిఃనేతను, సుదీర్ఘ పాలనానుభవం ఉన్న వ్యక్తిని మీరు జైల్లో పెట్టారంటే రేపు మేం అధికారంలోకి మీకు ఏ గతి పడుతుందో ఊహించుకోండి.. జగన్ దోపీడీ, అరాచక పాలనను అడ్డుకోవడానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుంది. టీడీపీ, జనసే, బీజేప కలిసి పోటీ చేయాలన్నది నా ఆశ. వైసీపీకి మద్దుతుగా దాడులకు పాల్పడుతున్న వారి అంతు చూస్తాం’’ అని అన్నారు.

అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి బాబును జైలుకు పంపడం అన్యాయమని ధ్వజమెత్తారు. ‘‘జగన్ బయటికి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకుంటున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదు. 2 లక్షలు ఉద్యోగాలు ఎక్కడ? మద్యపానం ఎక్కడ అమలైంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇసుక సహా అన్ని వనరులను దోచుకుంటున్నారు. వీటిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ రోజు నేను లోకేశ్, బాలకృష్ణల మధ్య నిలబడాల్సి వచ్చింది. ఇది జనసనే, టీడీపీ వ్యవహారం కాదు. ఏపీ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. నేను ఎన్డీఏలో ఉన్నా.. బీజేపీ మాతో కలసి వస్తుందని ఆశిస్తున్నా ’’ అని అని చెప్పారు. 

Tags:    

Similar News