Pawan Kalyan: హాస్పిటల్లో పవన్.. టీడీపీ, జనసేన క్షేత్రస్థాయి సమావేశం వాయిదా
By : Bharath
Update: 2023-10-10 13:42 GMT
వారాహీ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో విజయవాడలో అక్టోబర్ 11న జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం వాయిదాపడింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు జనసేన.. టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు చర్చించాల్సి ఉంది. రేపు జరిగే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయాల్సిఉంది. కానీ పవన్ కు వైరల్ ఫీవర్ రావడటంతో ఈ సమావేశం వాయిదా పడింది. సమావేశం తదుపరి తేదీన త్వరలో ప్రకటిస్తామని జనసేన ప్రకటించిది.