నేడు అన్నవరానికి జనసేనాని.. రేపట్నుంచి వారాహి యాత్ర ప్రారంభం

Update: 2023-06-13 06:27 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపట్నుంచి మొదలుకానుంది. జూన్ 14న కత్తిపూడి నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నారు. తొలుత రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అఅనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రానికి పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకోనున్నారు. సత్యగిరి కొండపైనున్న గెస్ట్ హౌస్ లో రాత్రికి ఆయన బస చేయనున్నారు. అన్నవరం కొండపై భక్తుల మనోభావాల దృష్ట్యా ఎలాంటి రాజకీయ సభలు, ప్రసంగాలు, పార్టీ జెండాలు తీసుకురావడం నిషేధమని, ఇందుకు సహకరించాలని ఈవో ఆజాద్ కోరారు.

పోలీసులు వర్సెస్ జన సైనికులు

మరోవైపు కోనసీమ జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పవన్ వారాహి యాత్రకు పోలీసులు అభ్యంతరాలు లేవనెత్తారు. పవన్ వారాహి యాత్ర మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌ వివరాలు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జనసేన నేతలు పవన్ పర్యటన విషయంపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. వారాహి యాత్రకు అనుమతి ఇవ్వటానికి పోలీసులు లేవనెత్తిన అభ్యంతరాలపై కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వారాహి యాత్ర షెడ్యూల్

వారాహి తొలిదశ యాత్రను ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర బహిరంగ సభల షెడ్యూల్ను జనసేన ఇప్పటికే ప్రకటించింది.

జూన్ 14న- కత్తిపూడి సభ

జూన్ 16న- పిఠాపురంలో వారాహి యాత్ర, బహిరంగ సభ

జూన్ 18న- కాకినాడలో వారాహి యాత్ర, బహిరంగ సభ

జూన్ 20న-ముమ్మిడివరంలో వారాహి యాత్ర, బహిరంగ సభ

జూన్ 21న-అమలాపురంలో వారాహి యాత్ర, బహిరంగ సభ

జూన్ 22న-పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ

జూన్ 23న-నరసాపురంలో వారాహి యాత్ర, బహిరంగ సభ



Tags:    

Similar News