స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ నెల 22వరకు ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలియగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో జైలులో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవనున్నారు. రేపు జైలులో చంద్రబాబుతో పవన్ ములాఖత్ అవుతారు.
ఇప్పటికే నారా లోకేష్కు ఫోన్ చేసిన పవన్.. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. గురువారం నేరుగా చంద్రబాబుతో పవన్ ములాఖత్ అవడం ఆసక్తిగా మారింది. ఇక ఇవాళ సాయంత్రం చంద్రబాబుతో బాలకృష్ణ ములాఖత్ కానున్నారు. మంగళవారం బాబును నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి కలిశారు. ఈ క్రమంలో బాబు భద్రతపై భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. బాబు కట్టిన జైల్లోనే ఆయన్ను కట్టిపడేశారని అన్నారు.
మరోవైపు చంద్రబాబు నాయుడికు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఆయనను సీఐడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు నిరాకరించింది. వచ్చే సోమవారం వరకు బాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.