Pawan Kalyan : జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ

Update: 2024-02-10 08:40 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలకు లేఖ రాశారు. మరో రెండు రోజుల్లో పోటీ చేసే స్థానాలపై స్పషత ఇస్తానని చెప్పారు. పొత్తులపై బహింగ విమర్శలు చేయొద్దని జనసేన నేతలకు సూచించారు. ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే తన దృష్టికి తేవాలని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజలు స్థిరత్వాన్ని కొరుకుంటున్నారని..ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఏపీ అభివద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకొవాల్సిందిగా ఇప్పటికే కేంద్రానికి స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు.

Tags:    

Similar News