మాజీ మంత్రి, వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే పార్థసారథిని కుటుంబ సభ్యులు విజయవాడ అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్కు తరలించారు. పార్థసారథిని పరీక్షించిన వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.