జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. పవన్ మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. సినీ గ్లామర్ అడ్డం పెట్టుకొని ప్రజలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌పై బురద జల్లడం తప్ప పవన్‌కు ఇంకో పనిలేదని పేర్నినాన్ని అన్నారు. చంద్రబాబు కోసం పని చేస్తున్నాననే విషయాన్ని పవన్ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన 25 సీట్లు కంటే ఎక్కువ పోటీ చేసే ప్రసక్తి లేదన్నారు.
వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలను పేర్నినాని ఖండించారు. వాలంటీర్లపై రోజుకొక మాట..పూటకొక మాట చెప్పతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ కార్యకర్తల్లో ఎంతోమందిపై హత్యాయత్నం, గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని..వారిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఫిర్యాదు చేసేందుకు అమిత్ షా వెళ్లే బదులు..స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగవని పవన్ ను పేర్నినాని ప్రశ్నించారు. రాజకీయాలు పడవని తెలుసుకుని చక్కగా సినిమాలు తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాలని హితవు పలికారు.