Janasena Party : జనసేనకు గాజు గ్లాజు గుర్తు కేటాయించడంపై పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. గాజు గ్లాజు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతేడాది మే 13న గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో (EC) సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించారని పిటిషనర్ తెలిపారు. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, జనసేన పార్టీని చేర్చారు. జనసేన పార్టీకి ఇటీవలే గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఉత్తర్వులు జనసేన పార్టీకి ఈ- మెయిల్ ద్వారా అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు జనసేన లీగల్ విభాగం ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అనంతరం వైసీపీ చేరారు. పవన్ పార్టీకి 5.53శాతం ఓట్ షేర్‌ను సాధించింది. జనసేన తన గాజు గ్లాసు సింబల్‌ని కాపాడుకోవడానికి తగిన సంఖ్యలో ఓట్లను పొందడంలో విఫలమైంది. అయితే గాజు గ్లాస్‌ను ఉమ్మడి చిహ్నంగా కొనసాగించాలని కోరుతూ పవన్ కల్యాణ్, మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గతేడాది కాలంగా ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు.