తిరుమలకు బాంబు బెదిరింపు.. నిందితుడి అరెస్ట్

Update: 2023-08-19 16:54 GMT

స్వాతంత్ర్య దినోత్సవం రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెదిరింపు కాల్ తో అలర్టైన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తమిళనాడు సేలం జిల్లాకు చెందిన బాలాజీ (39) ఆగస్టు 15న టీటీడీ కంట్రోల్ రూమ్ నుంచి అలిపిరి చెక్ పాయింట్‌ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్‌ సేకరించాడు. ఉదయం 11:25 గంటల సమయంలో అలిపిరి చెక్ పాయింట్ ఆఫీస్ కు కాల్ చేసి బాంబు పెట్టినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో బాంబు పేలుతుందని, వందల మంది చనిపోతారని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన విజిలెన్స్ , పోలీస్ సిబ్బంది అలిపిరి చెక్ పాయింట్ తో పాటు నడకమార్గంలో తనిఖీలుచేపట్టారు. అయితే ఎక్కడా బాంబ్ పెట్టినట్లు నిర్థారణ కావడంతో ఫేక్ కాల్ అని గుర్తించారు.




 

విజిలెన్స్ అధికారుల కంప్లైంట్ మేరకు కేసు బుక్ చేసిన తిరుమల టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉపయోగించిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితున్ని ట్రేస్ చేశారు. బాలాజీని శనివారం అరెస్ట్ చేశారు. అతను తమిళనాడులోని రత్నాకర్ బ్యాంక్ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే గత కొంత కాలంగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, కుటుంబ సమస్యలతో పాటు చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక మతిస్థిమితం కోల్పోయినట్లు తేలింది.




Tags:    

Similar News