Pawan kalyan arrest:పవన్ కల్యాణ్ అరెస్ట్.. ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి?: జనసేనాని
విజయవాడ వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ ముందుకు సాగనివ్వలేదు. విమానంలో విజయవాడ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులు అనుమతి ఇవ్వకపోవంతో పవన్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి వద్ద అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలొస్తాయని ఎంత చెప్పినా వినకపోవడంతో పవన్ ను అరెస్ట్ చేసినట్లు జగ్గయ్యపేట పోలీసులు వివరించారు.
కార్యకర్తలపై లాఠీ ఛార్జ్:
పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో నడుచుకుంటూ విజయవాడ వైపు వెళ్లారు. అయినా నిలువరిచడంతో రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఆయన వెంట భారీగా జన సైనికులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారణం చెప్పకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులకు కార్యకర్తులు ప్రశ్నించారు. వాళ్లంతా ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో పవన్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నామన్న విషయం తెలియక పోవడంతో.. మరోసారి ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.