Chandrababu : చంద్రబాబుకు బిగ్ షాక్.. ములాఖత్ల్లో కోత

Byline :  Bharath
Update: 2023-10-17 13:32 GMT

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. పోలీస్ అధికారులు చంద్రబాబు ములాఖత్ లో కోత విధించారు. ఇదివరకు రోజుకు రెండు లీగల్ ములాఖత్ లు ఉండగా.. దాన్ని ఒకటికి కుదించారు. బాబు ములాఖత్ ల వల్ల సాధారణ ఖైదీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిపాలనా కారణాలతో రెండో ములాఖత్ ను రద్దు చేస్తున్నట్లు జైలు అధికారి.. లిఖిత పూర్వకంగా ప్రకటించారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఐదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్ లను కూడా కుదించడం.. ముమ్మటికీ కుట్రే అని ఆరోపిస్తున్నారు.




Tags:    

Similar News