శ్యామ్ మృతిపై బాబు శవ రాజకీయం.. వీడియోలతో క్లారిటీ ఇచ్చిన వైసీపీ..

Update: 2023-06-27 16:12 GMT

జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని శ్యామ్‌ అనుమానాస్పద మృతి రాజకీయరంగు పులుముకుంది. వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ఓ ఒక్క అవకాశాన్ని వదలుకోవడం లేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్‌ ఆత్మహత్యను సైతం చంద్రబాబు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆత్మహత్యకు ముందు శ్యామ్ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది.

శ్యామ్ మరణం వార్త తెలియగానే చంద్రబాబు దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ కారణంగానే అతను ప్రాణాలు తీసుకున్నాడని నిందలు మోపారు. శ్యామ్ మృతిపై అనేక అనుమానాలున్నాయన్న చంద్రబాబు.. సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక వైసీపీ సభ్యుల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నందున పాదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

అటు లోకేశ్ సైతం తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచారు. నిరుద్యోగి శ్యామ్ అనుమానాస్పద మరణం గురించి తెలిసి బాధకలిగిందన్న లోకేశ్ అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. స్థానికులు ఆరోపిస్తున్నట్లు వైసీపీ నేతల హస్తం ఉన్నా పక్షపాతం లేకుండా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. శ్యామ్ కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు.


బాబు ఆరోపణలపై వైసీపీ స్పందించింది. శ్యామ్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలను బయటపెట్టింది. వాటిలో శ్యామ్ తన నిర్ణయానికి కారణాలు వివరించాడు. ఉద్యోగం చేయడం ఇష్టంలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. చంద్రబాబు శవాలను సైతం రాజకీయంగా వాడుకోవాలని చూడటం దురదృష్టకరమని అభిప్రాయపడింది. ఇలాంటి నీచ రాజకీయ నాయకులు చేసే విష ప్రచారాల నుంచి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వైసీపీ పిలుపునిచ్చింది.

Tags:    

Similar News