సీఎం జగన్ను కలిసిన పొంగులేటి.. షర్మిల అంశంపై చర్చ..?

Update: 2023-07-06 14:41 GMT

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల్లో చేరికలు, కొత్త పొత్తులు తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీసీఎం జగన్ ను పొంగులేటి శ్రీనివాస్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సమావేశంలో షర్మిల అంశంపై చర్చించనట్లు సమాచారం. వైఎస్సార్టీపీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె డీకే శివకుమార్ తో రెండుసార్లు భేటీ అవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తారనే వార్తలూ వచ్చాయి.కానీ షర్మిలకు మాత్రం తెలంగాణను విడిచివెళ్లడం ఇష్టం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ క్రమంలో జగన్ తో పొంగులేటీ భేటీ ఆసక్తికరంగా మారింది. పైకి ఏపీలో తన కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించిన అంశాలపై చర్చ అని చెబుతున్నా... అసలు విషయం షర్మిల అంశమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో షర్మిల ఎంట్రీకి జగన్ నో చెబుతున్నారని.. దానిపై చర్చించేందుకే కాంగ్రెస్ అధిష్టానం పొంగులేటిని పంపిందనే వాదనలు లేకపోలేదు. ఏదిఏమైన తెలుగు రాజకీయాల్లో షర్మిల పార్టీ మ్యాటర్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.

Tags:    

Similar News