Posani Krishnamurali : కాపులను పవన్ నట్టేట ముంచాడు.. పోసాని షాకింగ్ కామెంట్స్

Byline :  Shabarish
Update: 2024-03-08 11:07 GMT

కాపులను పవన్ నట్టేట ముంచాడని ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. అప్పట్లో చంద్రబాబును తిట్టిన పవన్ ఇప్పుడు ఆయన్నే దేవుడని అంటున్నాడని ఫైర్ అయ్యారు. వంగవీటి రంగాను చంద్రబాబు నడిరోడ్డుపై నరికి చంపాడని, ఈ ఘటన కాపుల్లో అందర్నీ కంటతడి పెట్టేలా చేసిందన్నారు. పవన్ కళ్యాణ్‌ను కాపులు మరో రంగా అనుకున్నారని, కానీ బాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ ప్రయత్నిస్తుండటం చూసి భరించలేకపోతున్నారన్నారు.

ఆనాడు పవన్ కాపు సోదరుల వద్దకు వెళ్లి భరోసా ఇచ్చాడని, అందరూ తనకు అండగా నిలవాలని వేడుకున్నాడని, చంద్రబాబును, నారా లోకేశ్‌ను, బాలకృష్ణను ఇష్టానుసారంగా పచ్చి బూతులు తిట్టాడని పోసాని అన్నారు. కానీ నేడు వారికే జేజేలు పలుకుతున్నారన్నారు. రంగా అంత కాకపోయినా అందరికీ అండగా ఉంటాడని నమ్మిన కాపులకు నేడు పవన్ తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వారాహితో వచ్చి కాపులందరినీ ఐక్యంగా ఉండడని చెప్పారన్నారు. అయితే ఇప్పుడేమో కాపులంతా బాబు కోసం నిలవాలని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

కమ్మ నాయకుడు చంద్రబాబునే సీఎంగా చేయాలని పవన్ చూస్తున్నాడని, ఆయన మాటలతో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. తాను జగన్‌ను సపోర్ట్ చేయడం లేదని, తాను కూడా ఓటరునని, సమాజంలో ఒకడిగా ఉన్నానని, ముఖ్యంగా బీజేపీ వాడ్ని కానని పోసాని కృష్ణమురళి అన్నారు. 13 ఏళ్లుగా జగన్‌ను చూస్తున్నానని, ఉన్నవాళ్లలో జగన్ బెస్ట్ కాబట్టే ఆయనకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు. పీఎం మోడీ నిజాయతీపరుడు కాబట్టే ఆయన్ని ఎంతగానో ఇష్టపడుతానని, తెలగాణను తెచ్చాడు కాబట్టే కేసీఆర్‌ను అభిమానిస్తానని పోసాని కృష్ణమురళి అన్నారు. 


Tags:    

Similar News