తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

By :  Krishna
Update: 2023-11-27 03:12 GMT

ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల వెళ్లిన మోదీ.. ఇవాళ ఉదయం 8గంటలకు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. సుమారు 50 నిమిషాల పాటు ఆయన ఆలయంలో ఉన్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు వెళ్లడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2015, 2017, 2019లో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో ఆయన తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు.

తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో మోదీ హకీంపేట చేరుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11గంటలకు మహబూబాబాద్ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ బండి సంజయ్కు మద్ధతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకూ రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News